Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Heavy Rain : భారీ వర్షం.. నదిని తలపిస్తున్న రహదారి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..! 

Heavy Rain : భారీ వర్షం.. నదిని తలపిస్తున్న రహదారి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..! 

దమ్మపేట, మనసాక్షి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపాతం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి పోయి, ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి.

దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి మీద నీరు ముంచెత్తి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు కదలలేని పరిస్థితి నెలకొంది. నెమలిపేట గ్రామంలో కాలువ పొంగిపొర్లి పలు ఇళ్లలోకి నీరు చేరింది. అలాగే పలు ఇళ్ళలో ఇంట్లోని సామాగ్రి తడిచి నీటిలో కొట్టుకుపోయాయి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది.

మైదాన ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులకు ఈ వర్షం కొంత మేలు చేయగా, లోతట్టు ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులకు ఈ వర్షం కొంత నష్టం కలిగించే అవకాశం ఉండడంతో ,లోతట్టు ప్రాంతాల్లో పంటలు వేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

  1. TG News : పట్టపగలు దారి దోపిడీ.. కళ్ళల్లో కారం కొట్టి రూ.40 లక్షలు చోరీ..! 

  2. Karimnagar : నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్.. అభినందించిన సీపీ..!

  3. Nalgonda : అధిక ధరలకు యూరియా విక్రయం.. అధికారుల తనిఖీ.. పోలీసులు కేసు నమోదు..!

  4. Vice President : ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం (వీడియో)

  5. Nalgonda : 15న నల్లగొండకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాక.. ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

మరిన్ని వార్తలు