Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

హైదరాబాదులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్..!

హైదరాబాదులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాదులో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. దాంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది.

శనివారం ఉదయం నుంచి పలుచోట్ల వర్షం కురవడంతో రాత్రి అయ్యేవరకు భారీగా పలుచోట్ల కురుస్తుంది. హైదరాబాదులోని హయత్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ , లకిడికాపూల్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన వర్షం తో ఐదు నుంచి 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మరో రెండు రోజులు భారీ వర్షాలు:

మరో రెండు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. వారం రోజులపాటు వర్షాలకు సెలవు ఇచ్చిన వరణుడు మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ వాసులు వర్షాల కారణంగా అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

LATEST UPDATE :

BIG BREAKING : బాలికలతో తప్పుగా ప్రవర్తన.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్..!

పేదలపై మరో పిడుగు.. వంట నూనెలు మరింత పిరం..!

District collector : ఓటరు ఇంటిని సందర్శించిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..! 

Good News : సింగరేణి కార్మికులకు దసరా కానుక.. భారీగా బోనస్..!

మరిన్ని వార్తలు