Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)

Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై రైల్వే ట్రాక్లపై వరద నీరు ప్రవహిస్తుంది. దాంతో హైదరాబాద్ – కామారెడ్డి మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
దాంతో పాటు రైళ్లను అధికారులు రద్దు చేశారు. రెండు రైళ్లు రద్దు చేయగా, నాలుగు రైళ్లను దారి మళ్ళించారు. కాచిగూడ – మెదక్, నిజామాబాద్ – తిరుపతి రైళ్లు రద్దు చేశారు. ఈ రూట్లో వర్షం కారణంగా పలుచోట్ల పట్టాలపై నుంచి వర్షపు నీరు వరద ప్రవహిస్తుంది.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
వీడియో
RAILWAY TRACK WASHED AWAY AT KAMAREDDY 🤯🤯🌊
ALL TRAINS MOVING TOWARDS KAMAREDDY – NIZAMABAD ROUTE ARE SUSPENDED
PLEASE NOTE AND PLAN ACCORDINGLY 🙏 pic.twitter.com/VTxfAWiiu6
— Telangana Weatherman (@balaji25_t) August 27, 2025
MOST READ :









