Breaking Newsక్రైంతెలంగాణసినిమా

Allu Arjun : హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలింపు..!

Allu Arjun : హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలింపు..!

మన సాక్షి, హైదరాబాద్ :

సినీ హీరో, నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ను శుక్రవారం తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 4వ తేదీన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో అల్లు అర్జున్ ను A2గా చేర్చారు.

అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారుగా రెండు గంటల పాటు విచారణ చేపట్టారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేశారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టులో అల్లు అర్జున్ ను ప్రవేశపెట్టనున్నారు. నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బంధమస్తు ఏర్పాటు చేశారు.

అదేవిధంగా అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ వేశారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కోర్టు విచారణ చేపట్టనున్నది. అయితే అల్లు అర్జున్ అరెస్టు వల్ల మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ఆయన నివాసానికి వెళ్లారు. అదేవిధంగా హీరో అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు