తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్

TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్..!

TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్లు, ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపించాయి. వాదనలు పూర్తిగా విన్న అనంతరం హైకోర్టు ఎన్నికలకు సంబంధించి పలు ప్రశ్నలను అడిగింది. ఆ తర్వాత తీర్పు రిజర్వులో పెట్టింది.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్ని రోజుల్లో నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని అడగడంతో ప్రభుత్వం 60 రోజులు గడువు కావాలని కోరింది. కాగా గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎందుకు నిర్వహించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు స్పందిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మరో 60 రోజులు గడువు కావాలని ప్రభుత్వం కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఎన్నికల నిర్వహణపై కోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది.

MOST READ : 

  1. TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా.. షెడ్యూల్ ఎప్పుడంటే..!

  2. Rythu : ఆ రైతులకు డబుల్ బోనాంజా.. ఎకౌంట్లో రూ.20 వేలు..!

  3. TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!

  4. Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

  5. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు