Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయం

TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా.. షెడ్యూల్ ఎప్పుడంటే..!

TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా.. షెడ్యూల్ ఎప్పుడంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఏడాదికి పైగా స్థానిక సంస్థలు ఖాళీగా ఉండడంతో ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. అందుకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్దమైన విషయం తెలుస్తోంది.

రైతు భరోసా పూర్తిస్థాయిలో పంపిణీ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండ్ ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన సమావేశం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

దాంతో వారం రోజుల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. జూలై మాసంలో ముందుగా ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్ధం చేసింది. ఓటర్ జాబితాలు, పోలింగ్ స్టేషన్ల వివరాలను కూడా ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 12,815 గ్రామ పంచాయతీలు, 1.14 లక్షల వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా 538 జడ్పిటిసిలు, 5813 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బిజెపిల మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.

MOST READ : 

  1. District Collector : రైతు భరోసా రూ.592.55 కోట్ల జమ..!

  2. Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

  3. District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

  4. Calendar : వైరల్ అవుతున్న 84 ఏళ్ల క్యాలెండర్.. డేటు, వారం సేమ్.. ఏం జరిగిందో తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు