Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లారాజకీయం

తొర్రూరులో హై టెన్షన్..!

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎంపిక ఎన్నిక సమయంలో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు.

  • తొర్రూరులో హై టెన్షన్..!

మన సాక్షి, మహబూబాబాద్ :

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎంపిక ఎన్నిక సమయంలో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా 9 వార్డులను బీఆర్ఎస్ గెలిచింది. ఏడు వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాగా కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ పీఠం దక్కించుకునేందుకుగాను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓట్లను నమోదు చేసుకున్నారు.

దాంతో ఇరు పార్టీలకు 9 మంది బలం ఉంది. కాగా బీఆర్ఎస్ కౌన్సిలర్ వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రావడంతో అభ్యంతరం చెప్పిన కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దాంతో పోలీసులు అతనిని బయటకు పంపారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. కాగా తను విప్ జారీ చేసేందుకు వచ్చానని, తనను విప్ కూడా జారీ చేయకుండా బయటకు పంపారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా 12:30 గంటలకు ఉత్కంఠతకు తెరపడనున్నది.

మరిన్ని వార్తలు