Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

Nelakondapalli : చారిత్ర ఆధారాలకు నెలవు.. మరో ప్రాచీన ఆనవాళ్లు వెలుగులోకి..!

Nelakondapalli : చారిత్ర ఆధారాలకు నెలవు.. మరో ప్రాచీన ఆనవాళ్లు వెలుగులోకి..!

నేలకొండపల్లి, మన సాక్షి :

నేలకొండపల్లి చారిత్రక ఆధారాలకు పెట్టింది పేరు గా నిలుస్తుంది. ఇప్పటికే అనేక చారిత్రక ఆధారాలకు అలవాలైన నేలకొండపల్లి తవ్వే కొద్ది అనవాళ్లు  లభ్యమవుతున్నాయి. స్థానిక బౌద్ధసూస్థం సమీపంలోని ఓ రైతు పొలంలో భూమి లోపటికి కూరకపోయిన నలు పలకల రాతి స్థంభం ఒకటి సోమవారం తెలంగాణ చరిత్ర బృందం కో-కన్వీనర్ కట్టా శ్రీనివాస్, పసుమర్తి శ్రీనివాస్ లు పరిశీలన లో వెలుగులోకి వచ్చింది. భూమి పైన రెండు అడుగుల ఎత్తు…

అడుగున్నర వెడల్పు ఎనిమిది అంగుళాల మందం ఉన్న ఒక రాతి ఫలకం పైన శాసనాలలో కనిపించే చిహ్నలు కనిపిస్తున్నాయి. కాకతీయుల కాలంలో శైవానికి సంబంధించిన, డమురక చిహ్నం, త్రిశూల చిహ్నం తోపాటు సూర్యచంద్రుల చిహ్నాలు ఉన్నాయి. ఆచంద్రార్కం నిలబడి ఉండాలి అనే ఉద్దేశ్యంతో సూర్యచంద్రులను చెక్కేవారు.

అటువంటి చిహ్నాలతో ఈ శిలాఫలకం లోని ముఖ పలకం ఉండటంతో ఈ రాతిబండ ను భూమిలో నుంచి బయటకు తీసి పరిశీలించినట్లుయితే ప్రాచీన కాలపు శాసనలేమైనా దొరికే అవకాశం ఉండోచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం పొలాలలో వరి కోతలు పూర్తి అయిన ప్రోక్లెయిన్ వెళ్లటానికి అనుకూలంగా వున్న పరిస్థితులలో దీనిని పెకిలించి లోపట శాసనం వంటిది వున్నదా లేదా.. అనే విషయాలను పరిశీలించగలిగే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ కాలాలకు చెందిన అనేక శాసనాలు నేలకొండపల్లి లో దొరికి ఉన్న నేపధ్యంలో మరో కొత్త శాసనం దొరకటం…చర్రితలో కొత్త కోణాలు వెలుగు లోకి రావటానికి అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

MOST READ : 

  1. Mental Health : మానసిక ఆరోగ్యం కోసం ఇలా చేయండి..!

  2. Nose: ముక్కులో నుంచి రక్తం వస్తోందా.. అయితే ఈ ముప్పు ఉన్నట్లే..!

  3. Miryalaguda : లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  4. Free Bus : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పై సజ్జనార్ కీలక ప్రకటన..!

  5. Free Bus : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పై సజ్జనార్ కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు