Miryalaguda : యోగా క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు..!

యోగా క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Miryalaguda : యోగా క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు..!

మిర్యాలగూడ , మనసాక్షి :

యోగా క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ కలసి సుఖసంతోషాలతో జరుపుకోనే హోలీ లాంటి పండుగలను పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడే సహజసిద్ధ రంగులను మాత్రమే చల్లుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో కోలా సైదులు, పైడిమర్రి సురేష్, నాగేశ్వర్ రావు, గుడిపాటి కోటయ్య, సుదర్శన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కంచర్ల వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్, అంజిరెడ్డి, మక్ల, హరి, లింగయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.

ALSO READ : Telangana : తెలంగాణలో ఘోరం.. కన్న కొడుకుని కడతేర్చిన తల్లి..!