Breaking Newsక్రైంజాతీయం

BIG BREAKING : జమ్ము కాశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 30 మంది గాయాలు..!

BIG BREAKING : జమ్ము కాశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 30 మంది గాయాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

జమ్మూకాశ్మీర్ లో ఘోరమైన సంఘటన జరిగింది. నౌగామ్ పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఏడుగురు మృతి చెందగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

పేలుడు సంభవించినప్పుడు మంటలు, దట్టమైన పొగ కమ్మేశాయి. మృతదేహాలను శ్రీనగర్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు