Kondagattu Fire : కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 33 షాపులు..!

Kondagattu Fire : కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 33 షాపులు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజి వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. హనుమాన్ విగ్రహం నుంచి కరీంనగర్ – జగిత్యాల ప్రధాన రహదారి వరకు సుమారుగా 33 షాపులు ఉన్నాయి. ఈ షాపులలో రకరకాల బొమ్మలు ఉంటాయి. ఏం జరిగిందో..? ఏమో..? తెలియని పరిస్థితి నెలకొన్నది.
చిన్నపాటి మంట తీవ్ర రూపం దాల్చి షాపులు మొత్తం పూర్తిగా కాలిపోయాయి. స్థానిక పండుగలు, సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని వ్యాపారులు భారీగా బొమ్మలను కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. సుమారుగా ఒక్కొక్క షాపులో 8 లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు సరుకులు ఉండొచ్చని పేర్కొంటున్నారు.
కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. వ్యాపారులంతా తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
MOST READ :
-
Murder : గిరిజన మహిళను హత్య చేసి బావిలో పడేసిన ఉదంతం.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..!
-
Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!
-
ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్.. డ్రైవర్ బ్యాగులో రూ.4.30 లక్షలు..!









