TOP STORIESBreaking Newsజాతీయం

SRISHAILAM : శ్రీశైలంకు భారీ వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీటి విడుదల..!

SRISHAILAM : శ్రీశైలంకు భారీ వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీటి విడుదల..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది జోరుగా ప్రవహిస్తుంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా జలకలలాడుతున్నాయి. ఆల్మట్టి నుంచి మొదలుకొని జూరాల ప్రాజెక్టు వరకు కూడా జలాశయాలన్నీ నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. శ్రీశైలం కు 2. 25 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దాంతో ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంతో విద్యుత్ ఉత్పాదన ప్రారంభించారు. కుడిగట్టు విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు. దాంతో విద్యుత్ ఉత్పాదన వల్ల 31, 784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశ నీటిమట్టం పూర్తిస్థాయి సామర్థ్యం 885 అడుగులకు గాను ప్రస్తుతం 853.20లకు చేరింది.

నాగార్జునసాగర్ కు స్వల్పంగా ఇన్ ఫ్లో వస్తుంది. ప్రస్తుతం 9500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. నాగార్జున సాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 503.80 అడుగులు మాత్రమే ఉంది.

ఇవి కూడా చదవండి : 

BUDGET 2024 – 25 : అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.. ముఖ్యాంశాలు..!

BIG BREAKING : అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా..!

నల్గొండ జిల్లాలో తూములు మూసేసి, రాత్రిపూట కాపలా పెట్టి.. సాగర్ నీటిని ఖమ్మంకు తరలింపు..!

Job Vacancies : ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!

 

మరిన్ని వార్తలు