Job Vacancies : ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
Job Vacancies : ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టులకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో గౌరవ వేతనంతో కూడిన కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ స్పెషాలిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లు 11, అసోసియేట్ ప్రొఫెసర్లు 16, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 24, సీనియర్ రెసిడెంట్లు 21 మరియు ట్యూటర్ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్ కిషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నియామకాలు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. ఇట్టి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎండి, ఎంఎస్, పిజి డిగ్రీలో సాధించిన మార్కులు, ట్యూటర్ పోస్టులకు ఎంబీబీఎస్ లో సాధించిన మార్కులు పరిగణలోకి తీసుకుంటామని, ఆర్ ఓ ఆర్ ను అనుసరిస్తామని తెలిపారు.
ట్యూటర్, సీనియర్ ప్రెసిడెంట్ పోస్టులకు 31 మార్చి 2025 నాటికి 45 సంవత్సరాల లోపు ఉండాలని స్థానికేతరుల అభ్యర్థుల కంటే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
అభ్యర్థులు దరఖాస్తు తో పాటు ఒరిజినల్ అకాడమిక్ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రెండు సెట్ల అకాడమిక్ సర్టిఫికెట్లు ఫోటో కాపీలతో ఈనెల 25 నుండి వచ్చే నెల 3 తేదీ వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు నారాయణపేట మండలం అప్పంపల్లి గ్రామం సమీపాన ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఛాంబర్ లో జరిగే ఇంటర్వ్యూలకి హాజరుకాగలరని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
BREAKING : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పొడిగింపు..!
Srishailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..!









