Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

నల్గొండ జిల్లాలో తూములు మూసేసి, రాత్రిపూట కాపలా పెట్టి.. సాగర్ నీటిని ఖమ్మంకు తరలింపు..!

నల్గొండ జిల్లాలో తూములు మూసేసి, రాత్రిపూట కాపలా పెట్టి.. సాగర్ నీటిని ఖమ్మంకు తరలింపు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ తూములు మూసేసి ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేయడంతో ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ కు నీటిని తరలిస్తున్నారు.

నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటిని బుధవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీటిని ఎడమ కాలువ మీద ఉన్న తూములని మొత్తాన్ని మూసేసి ఖమ్మం జిల్లాకి తాగు నీరు సాకుతో నీటిని తరలిస్తున్నారని ఆరోపించినారు.

గతంలో రైతుల పొలాలు ఎండుతున్నా.. చూసుకుంటూ సుమారు 15 రోజులపాటు నీటిని తరలించినారని, ఇప్పుడు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో మొత్తం చెరువులో ఎండిపోయి నెర్రెలు పెట్టి ఉన్నాయి. చెరువులో నెర్రెలు పెట్టడం వలన భూగర్భ జలాలు అడుగంటి తాగు సాగు నీరు లేక ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

యాద్గార్ పళ్లి పందిళ్ళపల్లి చెరువుకు ఫీడర్ చానల్ లేక వర్షాధార నీటితోనే చెరువు నిండుతుంది. సాగర్ ఎడమ కాలవ ద్వారా ఫీడర్ ఛానల్ లేక నీటిను నింపే పరిస్థితి లేదని వారన్నారు. వెంటనే అధికారులు స్పందించి లింకు చెరువుల ద్వారా ఫీడల్ చానల్ ఏర్పాటు చేసి యుద్ధప్రాధిపతిగా పైన చెరువులు నింపాలని వారన్నారు.

ఇప్పుడు గత వారం రోజుల నుండి హాలియా దగ్గర నుంచి మొదలుకొని కోదాడ వరకు మొత్తం తూములు మూసివేసి ఖమ్మంకి తరలిస్తున్నారని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వెళ్లి నీటిని కిందికి తరలిస్తున్నారని, తూములు తెరవకుండా పోలీసుల బందోబస్తు నీటిని తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

శ్రీశైలానికి వరద నీరు వస్తుంది కాబట్టి నాగార్జునసాగర్ కూడా నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండాకాలంకి సాగునీరు విడుదల డేటు ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నియోజకవర్గ నాయకులు వల్లంపట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

ఈ పంతులు మాకోద్దు..! ఆయన వస్తే.. పక్క స్కూల్ కు పంపిస్తాం.. MEO వద్ద విద్యార్ధుల తల్లిదండ్రులు మొర..!

Job Vacancies : ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!

Srishailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..!

సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు.. సాగుకు సిద్ధమైన రైతాంగం..!

మరిన్ని వార్తలు