తెలంగాణBreaking Newsసంక్షేమం

Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

మన సాక్షి తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. మహాశివరాత్రి సందర్భంగా వారికి శుభవార్త అందింది. భూమిలేని రైతు కూలీల కోసం ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. రైతు కూలీలకు వారి వారి ఖాతాలలో 6000 రూపాయలు జమ అయ్యాయి. ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నందున కోడ్ లేని జిల్లాల్లో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూలీలకు నిధులు జమ అయ్యాయి.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని 2025 జనవరి 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిధులు విడుదల చేశారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 18,180 మందికి 6000 రూపాయల చొప్పున బ్యాంకులలో జమ అయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం నిలిచిపోయింది.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో నిధులు విడుదల చేశారు. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో 66,240 మంది కూలీలకు 39.74 కోట్ల రూపాయలను ప్రభుత్వం వారి వారి ఖాతాలలో జమ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50.65 కోట్ల రూపాయలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా 84,420 మందికి అందజేసింది. ఎన్నికల కోడ్ ముఖ్యగానే మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రంలోని రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా నిధులు వారి ఖాతాలలో జమ కానున్నాయి.

MOST READ : 

  1. Gold Price : చాలా రోజుల తర్వాత.. భారీగా పడిపోయిన పసిడి ధర..!

  2. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!

  5. TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!

  6. Miryalaguda : రాత్రికి రాత్రే పంట పొలంలో రూ.20 లక్షలు.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన..!

మరిన్ని వార్తలు