Farmers : రైతులకు భారీ గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరలకు చర్యలు.. బిగ్ అప్డేట్..!

Farmers : రైతులకు భారీ గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరలకు చర్యలు.. బిగ్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
రైతులకు తక్కువ వడ్డీకి రుణాలతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు గాను కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్.పి.ఓ) ఏర్పాటు, ప్రోత్సాహక పథకం కింద తెలంగాణలో 311 సంఘాలను స్థాపించేందుకు చర్యలు చేపట్టింది.
ఈ సంఘాలు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తాయి. పెట్టుబడిలో రాయితీలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తాయి. దాంతో పాటు తక్కువ వడ్డీకి రుణాలను పంపిణీ చేయడమే కాకుండా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెట్ తో అనుసంధానాన్ని సులభతరం చేయడంలో ఈ సంఘాలు కృషి చేస్తాయి.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఈ సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తే రైతుల సంక్షేమం కోసం కృషి చేయనున్నారు. అందుకు గాను రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. వాటి వల్ల అన్నదాతలకు సాంకేతిక సహాయం, మెరుగైన మార్కెట్ అవకాశాలు అందించాలని నిర్ణయించింది. దీనివల్ల రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయ రంగంలో సుస్థిర అభివృద్ధి, ఆర్థిక భరోసా అందనున్నది.









