TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్..!

TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. యూరియా కోసం రైతులకు ఇక నో టెన్షన్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. యూరియా కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దాంతో ఇక రైతులకు టెన్షన్ లేకుండా ఉండే పరిస్థితి రాబోతుంది.
రైతుల కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో అదనంగా 1.17 లక్షల టన్నుల యూరియా తెలంగాణకు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దాంతో ఈ నెలలో రాష్ట్రానికి 2.87 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి రానున్నద
రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో నిలబడటం, ఘర్షణలకు దిగడం, ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్న విషయం తెలిసిందే. దాంతో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నతులను అందజేసింది.
దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. సెప్టెంబర్ నెలకు గాను 2.87 లక్షల మెట్రిక్ట్ యూరియా సరఫరాకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇందులో ఇప్పటికే 1.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుతుందని మంత్రి పేర్కొన్నారు.
అదనంగా కేటాయించిన యూరియాలో 60 వేల మెట్లు ప్రస్తుతం రవాణాలో ఉన్నదని, ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో 33 వేల టన్నులు, వారం రోజుల్లో మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంటుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు.
MOST READ :
-
Miryalaguda : నల్గొండ జిల్లాలో రూ.200 కోట్ల యూరియా కుంభకోణం.. అక్రమాలకు హబ్ గా మిర్యాలగూడ..!
-
Red Rice : రెడ్ రైస్ తింటే ఆరోగ్యమేనా.. చాలా మంది ఇష్టపడుతున్నది అందుకేనా.. తెలుసుకుందాం..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..!
-
Additional Collector : సాదాబ్ బై నామాలపై జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. వారికి నోటీసులు ఇవ్వాలి..!









