Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Additional Collector : సాదాబ్ బై నామాలపై జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. వారికి నోటీసులు ఇవ్వాలి..!

Additional Collector : సాదాబ్ బై నామాలపై జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. వారికి నోటీసులు ఇవ్వాలి..!

సూర్యాపేట, మనసాక్షి

భూ భారతి చట్టం అమలు లో భాగంగా సాదా భైనామా ధరఖాస్తు లను పరిశీలించి నోటీసులు జారీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు అన్నారు. గురువారం ఆర్డీఓ లతో, తహసీల్దార్లతో రెవిన్యూ అంశాలపై వెబెక్స్ ద్వారా అదనపు కలెక్టర్ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం జూన్,2 2014 కు ముందు సాదా కాగితం ద్వారా కొనుగోలు చేసి 2020 అక్టోబర్ లో మీ-సేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసి వుండి, గత 12 సంవత్సరాలుగా భూమిని సాగు చేస్తున్న వారివి మాత్రమే పరిశీలించాలని ఆదేశించారు.

తహసీల్దార్లు రెవిన్యూ గ్రామాల వారీగా దేవదాయ, వక్ఫ్,ఇరిగేషన్, రోడ్లు,ఇంకా వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ భూముల వివరాలతో కూడిన 22- ఏ రిజిస్టర్ ను త్వరగా సమర్పింంచాలని, అలాగే అన్ని రకాల ప్రభుత్వ భూములను జియో ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా సర్వే చేసి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన సరిహద్దులతో భూమి పటం తయారు చేయాలని సూచించారు.

ఈ విడియో కాన్ఫిరెన్స్ లో ఆర్డీఓ లు, తహసీల్దార్ లు, ఈ సెక్షన్ సూపరిటీడెంట్ సాయి గౌడ్, డి టి వేణు,అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..!

  2. Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశాలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..!

  3. Additional Collector : అదనపు కలెక్టర్ర్ ఆదేశాలు.. ఆ బార్ అండ్ రెస్టారెంట్లకు జరిమానా..!

  4. ACB : విద్యుత్ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రెండు కోట్లు గుర్తింపు..!

మరిన్ని వార్తలు