తెలంగాణBreaking Newsవ్యవసాయంసంక్షేమం

Rythu Bharosa : రైతు భరోసా పై రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో డబ్బులు జమ..!

Rythu Bharosa : రైతు భరోసా పై రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో డబ్బులు జమ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రైతు భరోసా పై తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. ఉగాది పండుగ నాటికి
పూర్తిస్థాయి రైతు భరోసా అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం విధితమే.

అందులో భాగంగా మూడు ఎకరాల వరకు పంటలు సాగు చేసిన రైతులకు గతంలో రైతు భరోసా నిధులు జమ చేయగా మంగళవారం 4 ఎకరాల వరకు సాగుచేసిన రైతులకు రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాలలో జమ చేశారు. 3.33 లక్షల ఎకరాలకు 1.06 లక్షల మంది రైతుల ఖాతాలలో 199.99 కోట్లు నిధులు ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసింది.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4 ఎకరాల లోపు ఉన్న 54.74 లక్షల మంది రైతులకు 77.78 లక్షల ఎకరాలకు 4666.60 కోట్ల రూపాయల నిధులను జమ చేసింది. గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 12 వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఒక విడత 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశారు.

మరో రెండు మూడు రోజుల్లో 5 ఎకరాల వరకు పంటల సాగుచేసిన రైతులకు రైతు భరోసా పథకం రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనున్నది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 54.74 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేయగా ఇంకా 22 లక్షల మంది రైతులకు అందజేయాల్సి ఉంది. కాగా రైతు భరోసా పథకం ద్వారా అత్యధికంగా నల్లగొండ జిల్లా రైతులకు 335.50 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.

MOST READ : 

  1. Good News : రూ.1500 చెల్లిస్తే లక్ష రూపాయలు.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఎప్పుడో..!

  2. Eye Health : ఈ లక్షణాలు కనిపిస్తే.. కళ్లజోడును తప్పనిసరిగా మార్చాల్సిందే.. కంటి ఆరోగ్యం కోసం..!

  3. Heart Attack : మీరు రోజూ ఇలా చేయకుంటే.. హార్ట్ ఎటాకే..!

  4. Hyderabad : హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు..!

  5. Gold Price : వరుసగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!

మరిన్ని వార్తలు