Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!
Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో విద్యాసంస్థలకు వరుసగా సెలవులు రానున్నాయి. దాంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు వరుసగా జులై 5,6వ తేదీలలో మొహరం పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించింది.
జులై 5వ తేదీన ఐఛ్ఛిక సెలవు (స్థానికంగా పాఠశాలలు తెరవచ్చు లేదా మూసి వేయవచ్చు), 6వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించింది. జులై 6వ తేదీన ఆదివారం సాధారణ సెలవు కావడంతో ఎలాగు సెలవే. ఇది ఇలా ఉండగా నెలవంక ఆలస్యం అయితే జూలై 7వ తేదీన కూడా ఐఛ్ఛిక సెలవుగా పెట్టుకునే అవకాశం ఉంది.
మొహరం పండుగ షియా ముస్లింలకు ముఖ్యమైన సంతాప దినం. ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని స్మరించుకుంటారు. హైదరాబాద్ నగరంలో ఊరేగింపులు భారీగా జరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు.
మరికొన్ని సెలవులు :
జూలై మాసంలో మరికొన్ని సెలవులను విద్యార్థులకు రానున్నాయి. జూలై 12వ తేదీ (రెండవ శనివారం) జూలై 13 వ తేదీ (ఆదివారం, లష్కర్ బోనాలు) జూలై 14 వ తేదీ సికింద్రాబాద్ లో బోనాలు (ఆ ప్రాంతంలో కొన్ని పాఠశాలలకు సెలవు), జూలై 20వ తేదీ లాల్ దర్వాజా బోనాలు (కొన్ని పాఠశాలలకు సెలవు),
జులై 21 హైదరాబాదులో అమ్మవారి ఊరేగింపు (పాఠశాలలకు సెలవు) ఉంటుంది.
MOST READ :
-
Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Narayanpet : నేను చనిపోలేదు బతికే ఉన్నా.. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లకు మొర..!
-
Alumni : 32 సంవత్సరముల తర్వాత.. అపూర్వ కలయిక..!
-
TG News : సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఎగిరి పడిన కార్మికులు.. 8 మంది మృతి..!









