TG News : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

TG News : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నది. 2024 – 25 జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 35 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్య, వైద్యం, ఆర్టీసీ ఇంజనీరింగ్ వివిధ విభాగాలలో ఈ కాలనీ భర్తీ చేయనున్నారు. 2024 – 25 ఏడాదిలో ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా కీలక మార్పులు చేపట్టింది.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ కనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు ఉద్యోగాల భర్తీ సవరణ చేసేందుకు ప్రణాళికలను చేపట్టింది. అందులో భాగంగా తొలి విడతలో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది.
ఉద్యోగాల భర్తీకి సంబంధించి టిజిపిఎస్సి, ఇతర నియామక సంస్థలకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్స్ పోలీసు, టీచర్, వైద్యశాఖ, విద్యుత్ శాఖ ఖాళీలలో భర్తీ చేయనున్నారు. బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా ఈ నోటిఫికేషన్ లో విడుదల చేయనుండగా ఆర్టీసీ, వైద్య విభాగాల్లో 10వేల పోస్టులు, విద్యుత్తు, ఇంజనీరింగ్ వివిధ విభాగాల్లో మొత్తం 35 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.
MOST READ NEWS :
-
Rythu : వరి కోయలకు నిప్పు రైతులకు ముప్పు.. ఎందుకో ప్రతి రైతు తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!
-
Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!
-
Hair Fall : పురుషులకే బట్టతల ఎందుకు.. నివారణకు సూచనలు..!









