TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రిజిస్ట్రేషన్లలో ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే స్టాంప్ డ్యూటీ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధ్యతరగతి మహిళల జీవన స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కొత్త స్టాంపు సవరణ బిల్లు – 2025 తీసుకురాబోతున్నది.
దానిలో భాగంగా ప్రస్తుతం మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించేలా నిర్ణయం తీసుకకనున్నారు. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. స్టాంపు సవరణ బిల్లు – 2025 అమలులోకి వస్తే ఆస్తి విలువలో 6 శాతం స్టాంపు డ్యూటీ విధించే అవకాశం ఉంది.
వాటిలో రిజిస్ట్రేషన్, బదిలీ చార్జీలు కూడా ఉంటాయి. రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి విలువలో 0.5% చార్జీలు వసూలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆస్తి ఇతరుల పేరు మీద బదిలీ చేసేటప్పుడు మొత్తం ఆస్తి విలువలో 1.5% బదిలీ ట్యాక్స్ చెల్లించేలా చట్టంలో తీసుకురాబోతున్నట్లు సమాచారం.
MOST READ :
-
KCR : ఐదుగురు సంతానం.. కొడుకు పేరు కేసీఆర్ గా నామకరణం చేసిన అభిమాని..!
-
TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!
-
Nagarjuna Sagar : పెరుగుతున్న నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం..!
-
Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : మత్స్య కార్మికులకు తీవ్ర హెచ్చరిక.. రెండు నెలల పాటు నిషేధం..!









