TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!

TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 60 వేల ఉద్యోగాలకు పైగా భర్తీ చేయగా మరో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తు నిర్వహిస్తున్నారు. అందుకుగాను ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ స్టడీ సర్కిల్లో టీజీపీఎస్సీ, ఎస్ఎస్సి, ఆర్ ఆర్ బి, బ్యాంకింగ్ ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నది.
అందుకుగాను అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీలోగా https://tgbcstudycircle.cgg.gov.in/Firstpage.do వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. డిగ్రీలో వచ్చిన మార్కుల ప్రామాణికంగా వీరిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున స్టైఫండ్ కూడా అందజేస్తారు. దాంతో పాటు పోటీ పరీక్షలకు ఎంపికైన వారికి ఐదు నెలల పాటు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు.
ఇది ఇలా ఉండగా కొత్తగా లక్ష ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వేయనున్నట్లు ఇటీవల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం విచిత్రమే. విద్యుత్, విద్య, ఆర్టీసీ, విభాగాల్లో ఖాళీ పోస్టును భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది.
MOST READ :
-
Musi : మూసి ప్రాజెక్టుకు భారీ వరద.. కుడి కాలువకు నీటి విడుదల..!
-
Nails Color: గోళ్ల రంగులతో మీ ఆరోగ్య సమస్య చెప్పేయొచ్చు.. ఎలాగంటారా..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సస్పెండ్..!
-
Social Media: రీల్స్‌కు బానిసయ్యారా.. ఈజీగా వదిలించుకోండిలా..!
-
Street Foods: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. కేంద్రం హెచ్చరిక..!









