Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!

Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల పంట పండుతోంది. వివిధ శాఖలలోని ఖాళీలను వెంటవెంటనే భర్తీ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వంలో వెలువడిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు నిర్వహించి వెంటనే వారికి ఉద్యోగాలు కల్పించారు.
పోలీసు శాఖలో ఉద్యోగాలతో పాటు గ్రూప్ వన్ 1, 2, 3 పరీక్షలు సైతం నిర్వహించి ఉద్యోగాలు కల్పించారు. అదేవిధంగా 11 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులను సైతం భర్తీ చేశారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. విద్యుత్ శాఖలో ఖాళీలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యుత్ శాఖలో మొత్తం 3260 పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలవడనున్నది.
వరంగల్ పరిధి NPDCL లో 2212 జూనియర్ లైన్ మెన్ పోస్టులు, 30 సబ్ ఇంజనీర్, 18 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. అదేవిధంగా (SPDCL) సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పరిధిలో 600 జేఎల్ఎం, 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే ఆ శాఖ పనితీరు మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాళీల అన్నింటిని భర్తీ చేయనున్నారు. అందుకు సంబంధించి నోటిఫికేషన్ వెలువలనున్నది.
MOST READ :
-
Ration Cards : లిస్టులో పేరు లేకుంటే మళ్ళీ దరఖాస్తుకు అవకాశం.. కొత్త రేషన్ కార్డుల పై లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!
-
February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!
-
Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!
-
Gold Price : వీకెండ్ లో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!









