TG News : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నేడే జాబ్ మేళా..!

TG News : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నేడే జాబ్ మేళా..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను వివిధ జిల్లాలలో ఎప్పటికప్పుడు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఉపాధి కల్పన శాఖ జాబ్ మేళా నిర్వహించనున్నది.
ఈనెల 18వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు.
డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మసీ, ఇంటర్, డిప్లమా, ఐటిఐ చేసిన అభ్యర్థులు జాబ్ మేళాకు అర్హులుగా ఉంటారని తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాల వయసు లోపు ఉన్నవాళ్లు జాబ్ మేళాలో పాల్గొనాలని ఆమె కోరారు. వరంగల్ జిల్లా ములుగు రోడ్డు లోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 18వ తేదీన జాబ్ మేళా ఉంటుంది.
విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకుని హాజరు కావాలని ఆమె కోరారు. ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుందని మరిన్ని వివరాలకు 70931 68464 నెంబర్ కు సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు.
MOST READ :
-
TG News : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. రైతు భరోసా పై సీఎం రేవంత్ ఆదేశాలు..!
-
District collector : ఆఫీస్ అంతా ఖాళీ.. జిల్లా కలెక్టర్ ఆశ్చర్యం, అసలేం జరిగింది..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీలింగ్.. వారికి మాత్రమే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Dharani : తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ముటేషన్ల కోసం.. సరికొత్త సేవలు..!









