District collector : ఆఫీస్ అంతా ఖాళీ.. జిల్లా కలెక్టర్ ఆశ్చర్యం, అసలేం జరిగింది..!
District collector : ఆఫీస్ అంతా ఖాళీ.. జిల్లా కలెక్టర్ ఆశ్చర్యం, అసలేం జరిగింది..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కలెక్టర్ సోమవారం పలు కార్యాలయాల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆమెకు విష్టు పోయే అంశాలు కనిపించాయి. కార్యాలయాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏంటా అని ఆశ్చర్యపోయారు. అదేంటో తెలుసుకుందాం..
నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం చౌరస్తా వద్ద గల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని, పక్కనే ఉన్న డి ఆర్ డి ఓ కార్యాలయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్ అక్కడి స్టాఫ్ హాల్ తో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారి గదిని పరిశీలించారు. గదిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని లేకపోవడంతో ఇంకా రాలేదా ? అని కలెక్టర్ అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా మక్తల్ నియోజకవర్గంలోని కర్ని గ్రామానికి డీఎంఅండ్ హెచ్ ఓ విజిట్ కు వెళ్లిందని సిబ్బంది తెలిపారు.
మిగతా స్టాఫ్ ఎవరెవరు వచ్చారని అడిగి తెలుసుకున్న కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ ను తీసుకుని ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు రాలేదో పరిశీలించారు. కార్యాలయంలో కొందరూ ఉద్యోగులు డిప్యూటేషన్ పై వెళ్లారని, మరి కొందరు గ్రూప్ -2 పరీక్ష కు వెళ్లినట్లు అక్కడి సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు.
కార్యాలయానికి వచ్చిన వారందరితో ఎవరెవరు ఏ ఏ పని చేస్తున్నారని, వాళ్ళ డెజిగ్నేషన్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న డిఆర్డిఏ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేయగా అక్కడ కూడా డిఆర్డిఓ, అడిషనల్ డిఆర్డిఓ గదులు మూసి ఉన్నాయి.
కార్యాలయంలో చాలా కుర్చీలు ఖాళీగానే ఉండటంతో కార్యాలయ హాజరు రిజిస్టర్ ను చూసి, విధులకు హాజరైన సిబ్బందితో ఆమె మాట్లాడారు. చాలా మంది కార్యాలయానికి ఎందుకు రాలేదని సెలవు పెట్టారా అని కలెక్టర్ ప్రశ్నించారు. గ్రూప్ -2 పరీక్ష కు వెళ్లారని సిబ్బంది చెప్పడంతో అందరూ పరీక్ష కు వెళ్ళారా అని నిలదీశారు.
అలాగే సెర్ఫ్ విభాగాన్ని తనిఖీ చేసి అక్కడి ఉద్యోగుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. సెర్ఫ్ విభాగంలో ఇద్దరు డీపీఎం లు, ఒక సీసీ ఉండటంతో ఎవరెవరు ఏ ఏ విధులు నిర్వహిస్తారని అడిగి తెలుసుకున్నారు.
MOST READ :
-
District collector : ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు రెడీ.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీలింగ్.. వారికి మాత్రమే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Dharani : తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ముటేషన్ల కోసం.. సరికొత్త సేవలు..!









