Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. అడవిదేవులపల్లి లో భార్యను నరికి చంపిన భర్త..!
Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. అడవిదేవులపల్లి లో భార్యను నరికి చంపిన భర్త..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లోని అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యంలో భార్యను భర్త నరికి చంపాడు. వివరాల ప్రకారం.. ముదిమాణిక్యంలో భార్య నర్సాకుమారిని భర్త సైదులు కత్తితో దారుణంగా నరికి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









