హైదరాబాద్ లో పేలుడు కలకలం, ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
హైదరాబాద్ లో పేలుడు కలకలం,
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
హైదరాబాద్ మనసాక్షి : హైదరాబాదులోని అబ్దుల్ గంజ్ పరిధి గౌలిగూడ ఆదివారం లో పేలుడు కలకలం సృష్టించింది. రసాయనాలను నాలలో పారబోస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందగా అతని తండ్రి తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
ఈ ప్రమాదంలో భరత్ అనే వ్యక్తి మృతి చెందగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడిన వేణుగోపాల్ ను ఆస్పత్రికి తరలించారు. భరత్ కెమికల్స్ వ్యాపారం చేస్తుండగా కాలం చెల్లిన కెమికల్స్ ను ఇంటి ఎదుట ఉన్న నాలలో పారబోస్తూ ఉండేవాడు ఈ క్రమంలో ఆదివారం కూడా కెమికల్స్ నాలలో పారపోసాడు. ఆ తర్వాత ఇనుప చువ్వ సహాయంతో రసాయనాలను కదిలించాడు. దీంతో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నది పేలుడు ధాటికి భారత్ అక్కడికక్కడే మృతి చెందగా అతని తండ్రి వేణుగోపాల్ కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :
1. వారిద్దరికీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే – latest news
2. రోడ్డు ప్రమాదంలో తండ్రి , కొడుకులు మృతి, తల్లికి తీవ్ర గాయాలు – latest news









