Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESక్రైంసూర్యాపేట జిల్లా

రోడ్డు ప్రమాదంలో తండ్రి , కొడుకులు మృతి, తల్లికి తీవ్ర గాయాలు – latest news

రోడ్డు ప్రమాదంలో తండ్రి , కొడుకులు మృతి,

తల్లికి తీవ్ర గాయాలు

మునగాల, మనసాక్షి : రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందగా. తల్లికి తీవ్రగాయాలయిన సంఘటన మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలోని యూటర్న్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మునగాల మండల కేంద్రానికి చెందిన వల్లోజు నాగరాజు (32) కుమారుడు మణికంఠ (08 నెలలు), భార్య వినోద లు మండలంలోని ముకుందాపురం గ్రామంలో జరిగే ఓ శుభకార్యనికి బుధవారం సాయంత్రం బైకుపై బయల్దేరారు.సుమారు రాత్రి 8.30 సమయంలో ముకుందాపురం గ్రామంలో యూ టర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుండి కోదాడ కు వస్తున్న కారు ఢీకొట్టడంతో బాలుడు మణికంఠ అక్కడిక్కడే మృతి చెందాడు. నాగరాజు కుడి కాలు తెగిపడి తీవ్ర గాయాలవ్వగా భార్య వినోద కు తీవ్ర గాయాలు అయ్యాయి.108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. నాగరాజును అక్కడ నుండి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. గురువారం ఉదయం మృతదేహాన్నీ కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి. మునగాల తరలించి తండ్రి కుమారునికి అంత్యక్రియలు నిర్వహించారు. నాగరాజు భార్య వినోద ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్నది. నాగరాజు కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు, బాలుడు మణికంఠ మృతదేహాలను చూసి కుమార్తెలు రోదిస్తున్న తీరు చూసి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది.

ఇవి కూడా చదవండి : 

1. మహిళల మాన, ప్రాణాలు కాపాడలేని కేసీఆర్ – షర్మిల

2. జూబ్లీహిల్స్ రేప్ కేసులో ఐదుగురు మైనర్లు, ఒకరు మేజర్

3. ఫ్లాష్ .. ఫ్లాష్ ,… కారు, బైక్ ఢీకొని ఒకరి దుర్మరణం

మరిన్ని వార్తలు