క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరంగారెడ్డి

Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్, ఇద్దరు కొడుకులు మృతి..!

Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్, ఇద్దరు కొడుకులు మృతి..!

చింతపల్లి, మనసాక్షి :

హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్- బైక్ ఢీ కొట్టిన సంఘటనలో ఇరువురు చినచిన్నారులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తమ్మలోని గూడెం గేట్ సమీపంలో గురువారం చోటు చేస్తుంది.

యాచారం మండల ఎస్ఐ మధు తెలిపిన వివరాల ప్రకారం కడ్తాల్ మండలం ముద్వేన్ గ్రామానికి చెందిన తలతి అభిరామ్( 9 ), ఆర్తి రాము, (5 ) సంవత్సరాలు గల ఇద్దరు చిన్నారులు తన తండ్రి ద్విచక్ర వాహనంపై మాల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాన్ని తమ్ములోని గేటు సమీపంలో ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇరువురు చిన్నారులకు బలంగా గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.

యాచారం మండలం పోలీసులు యాచాల మండల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చిన్నారుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓకే గ్రామానికి చెందిన ఇరువురు చిన్నారులు రోడ్డు ప్రమాదాని కి గురై మృతి చెందడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల రోధనలు చెప్పనలవి కానివి. దీంతో ముద్వేన్ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

MOST READ NEWS : 

  1. TG News : టోల్ ప్లాజా వద్ద అర్దరాత్రి కారు పల్టీ.. తనిఖీ చేయగా షాక్ తిన్న పోలీసులు..!

  2. Gold Price : బంగారం ధరలు ఒకేసారి ఢమాల్.. ఒక్కరోజే రూ.33,800 తగ్గింది..!

  3. Job Mela : 205 కంపెనీలచే మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

  4. Health : యూరిక్ యాసిడ్ సమస్య ఉందా.. ఉపశమనం పొందడం ఎలా..!

మరిన్ని వార్తలు