HYDRA : హైడ్రా దూకుడు.. నెక్స్ట్ అనురాగ్..?
HYDRA : హైడ్రా దూకుడు.. నెక్స్ట్ అనురాగ్..?
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
హైడ్రా హైదరాబాదులో దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణాలను వరుసగా కూల్చివేస్తుంది. పెద్ద, చిన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాన్నింటిని కూల్చివేస్తుంది. ఫిర్యాదులను స్వీకరిస్తూ విచారణ చేపట్టి నిర్మాణాలు కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే.
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపురం రెవిన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో 1.5 ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూట్ అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ ఇరిగేషన్ శాఖ ఏయి పరమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా ఆ సంస్థ చైర్మన్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
నెక్స్ట్ అనురాగ్..?
హైదరాబాదులో హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. చెరువులు ఆక్రమించుకొని నిర్మాణాలలో బఫర్ జోన్ నిర్మాణాలను కూల్చివేస్తుంది. దాంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కూడా బఫర్ జోన్ లో నిర్మాణం చేపట్టినట్టు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ నిర్మించారని వెంకటాపురం నాదం చెరువుల బఫర్ జోన్ లో ఈ యూనివర్సిటీ నిర్మించినట్టు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయిన విషయం తెలిసిందే.
ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా మాదాపూర్ లో సినీ హీరో అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా నాదం చెరువు పరిధిలో ఉన్న ఆక్రమణకు గురైన అనురాగ్ యూనివర్సిటీ ని కూడా కూల్చివేయనున్నారా..? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా రాజేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
LATEST UPDATE :
BIG BREAKING : భారీ బందోబస్తు మధ్య సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..!
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!
Musi : నిండిన మూసీ.. మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల..!
Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!









