MLA BaluNaik : పేదల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత దొరకడం నా అదృష్టం..!
MLA BaluNaik : పేదల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత దొరకడం నా అదృష్టం..!
దేవరకొండ, మనసాక్షి :
దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే బాలు నాయక్ నివాసం(మార్కెట్ యార్డ్) లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై దేవరకొండ నియోజక వర్గ ఎంపీడీఓలతో కలిసి దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్. సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ తొలి విడతలో ఎంపికైన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలు ఇప్పటికే అందజేయడం జరిగింది అని అన్నారు. తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను పేదవాళ్లలో బహుపేదవాళ్లకు ఇవ్వడం జరుగుతుంది అన్నారు.
మిగతా రెండు, మూడు, నాలుగు విడతలలో కూడా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం అన్నారు. లబ్దిదారుల కళ్లల్లో ఆనందం,పేదల కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదనే సాక్ష్యం అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ డి ఈ నాగేందర్ గౌడ్,డిటీడీఓ ఛత్రు నాయక్,మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓలు, ఏఈ లు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : వరదలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అధికారులకు సూచన..!
-
Suryapet : భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.. ఆరుగురి అరెస్ట్..!
-
District collector : భూసేకరణ పునరావాస, ఉపాధి పనులు వేగవంతం చేయాలి..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. బస్తీ దావఖాన ఆకస్మిక తనిఖీ..!
-
Minister Ponguleti : మిర్యాలగూడ వేదికగా మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన.. తల తాకట్టు పెట్టైనా వారికి ఇందిరమ్మ ఇళ్లు..!









