Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయంహైదరాబాద్

Ibrahimpatnam : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ కైవసం..!

గత కొద్ది రోజులుగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠం ఎన్నిక వాయిదా పడుతోంది. శనివారం ఉత్కంఠతకు తెరపడింది. ఎట్టకేలకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

Ibrahimpatnam : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ కైవసం..!

మన సాక్షి, హైదరాబాద్ :

గత కొద్ది రోజులుగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠం ఎన్నిక వాయిదా పడుతోంది. శనివారం ఉత్కంఠతకు తెరపడింది. ఎట్టకేలకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి ని, వైస్ చైర్మన్ గా బిజెపి కౌన్సిలర్ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు.

కాగా ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు నిర్వహించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ముగ్గురు కౌన్సిలర్ల పై కోర్టులో కేసు నడుస్తుండగా ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదని, ఎన్నికలు వాయిదా వేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అయితే కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించామని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. కాగా ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సుదర్శన్ రెడ్డి చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయగా కాంగ్రెస్ తరపున ఆకుల యాదగిరి పేరును ప్రతిపాదించారు. కాగా చైర్మన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గెలుపొందారు.

మరిన్ని వార్తలు