Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!

Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!
వెల్దండ, మనసాక్షి:
టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే 99 వేల రూపాయలు సైబర్ క్రైమ్ నేరస్థులు కొట్టేసిన సంఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని అజిలాపూర్ గ్రామానికి చెందిన తిరుపతయ్య గూగుల్ లో సన్ డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ వెతకగా 1800419 5370 నెంబర్ కనిపించింది. ఆ నెంబర్ కు తన మొబైల్ నుండి కాల్ చేసి సన్ డైరెక్ట్ కస్టమర్ కేరా అని అడిగితే అవతలి వ్యక్తి అవునన్నాడు.
అతనికి సన్ డైరెక్ట్ రీఛార్జ్ గురించి తెలపగా .. ఆ వ్యక్తి మీరు టీవీ ఆన్ చేసి మీ నంబర్ కి రూ. 10 రీఛార్జ్ చేసుకోమన్నాడు. అతను రీచార్జ్ చేసుకోనుగా అది ఫెయిల్ అయిందని అతనికి తెలుపాడు.
అతడు తనను ఫోన్ కట్ చేయకుండా లైన్ లోనే ఉండమంటే 22 నిమిషాల లైన్లోనే ఏదో చెబుతుంటే అనుమానం వచ్చి ఫోన్ కట్ చేసి బ్యాలెన్స్ చెక్ చేయగా రూ. 99 వేల రూపాయలు నాజురుల్ ఇస్లామ్ 7029418174 కు ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపించిందని బాధితుడు వాపోయారడు.
మోసపోయానని గ్రహించి వెంటనే 1930 నంబర్ కి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్దండ పోలీసులు తెలిపారు.
MOST READ :
-
Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!
-
Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!
-
Nimbachalam : నింబాచలానికి బ్రహ్మోత్సవ శోభ.. భక్తుల కొంగు బంగారం లక్ష్మీనారసింహుడు..!
-
Wrong Route : రాంగ్ రూట్ లో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు.. చలాన్లు చూసి కంగుతిన్నారు..!









