Phone Call : ఈ నెంబర్ల నుంచి ఫోన్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయొద్దు.. అవి ఏంటో తెలుసుకుందాం..!
Phone Call : ఈ నెంబర్ల నుంచి ఫోన్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయొద్దు.. అవి ఏంటో తెలుసుకుందాం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మరి మన అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే కాదు సెకండ్ల లోనే ఎకౌంటు కాళీ అవుతుంది. ఫోన్ ఎత్తినా.. మన ఎకౌంటు ఖాళీ అయినట్టే. అయితే అవి ఇంటర్నేషనల్ కాల్స్ వస్తే ఎట్టు పరిస్థితుల్లో లిఫ్ట్ చేయకూడదని తిరుపతి నేర విభాగం జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
ఏదో ఒక పనిలో ఉంటూ ఏమరపాటుగా ఫోన్ లిఫ్ట్ చేసినా.. కూడా అకౌంట్ ఖాళీ అవుతుంది. అందుకు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తరచుగా ప్లస్ 381 (సెర్బియా) ప్లస్ 255 ( టాంజానియా), ప్లస్ 563 (లోవ), ప్లస్ 375 (బెలారస్) లాంటి కోడ్ నెంబర్లతో ఫోన్ రింగ్ అవుతుందని పోలీసులు పేర్కొన్నారు.
ఇలా వచ్చే నెంబర్లను లిఫ్ట్ చేయొద్దని వారు పేర్కొన్నారు.
అదేవిధంగా వాటితోపాటు 94777455913, ప్లస్ 25590 1130460, ప్లస్ 56322 553736, ప్లస్ 37052 529259 నెంబర్ ల నుంచి ఫోన్లు వస్తే లిఫ్ట్ చేయొద్దని సూచించారు. ఈ నెంబర్ నుంచి ఫోన్లో వస్తే లిఫ్ట్ చేస్తే కేవలం మూడు సెకండ్ల లోనే ఫోన్లోని విలువైన సమాచారం మొత్తం కాజేస్తారని పోలీసులు తెలిపారు.
అదే విధంగా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి హ్యాష్ 90, లేకుంటే హాష్ 09 నెంబర్లు ప్రెస్ చేయమని చెబుతారు. ఒకవేళ అలా చేస్తే మీ సిమ్ కార్డు యాక్సిస్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :









