క్రైంBreaking Newsజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లా

దైవదర్శనానికి వెళ్తే.. వివాహితపై సామూహిక అత్యాచారం.. కీలక వ్యక్తులు అరెస్ట్..!

దైవదర్శనానికి వెళ్తే.. వివాహితపై సామూహిక అత్యాచారం.. కీలక వ్యక్తులు అరెస్ట్..!

మన సాక్షి, నాగర్ కర్నూల్ :

నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వివాహిత పై సామూహిక అత్యాచారం కేసు కీలకంగా మారింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత కు ముగ్గురు పిల్లలు, భర్తతో విభేదాల కారణంగా కొన్నాళ్లుగా దూరంగా ఉంటుంది.

శనివారం రాత్రి అంజనేయ స్వామి ఆలయం వద్ద దర్శనానికి తన బంధువుతో కలిసి వచ్చింది. ఆ సమయంలో చెట్టు కింద కూర్చొని మాట్లాడుతుండగా ఆలయ ఉద్యోగి చూసి తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికి ఆరుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి మద్యం మత్తులో ఆమెతో వచ్చిన బంధువుతో గొడవపడి అతడిని చెట్టుకు కట్టేశారు. ఆమెను పొదల్లోకి లాకెళ్లి అత్యాచారం జరిపారు.

బాధితురాలు సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను గుర్తించారు. ఆలయ ఉద్యోగితో సహా ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

ఊరుకొండ పేట కు చెందిన మహేష్ గౌడ్, మారుపాకుల ఆంజనేయులు గౌడ్, మట్ట ఆంజనేయులు గౌడ్, సాదిక్ బాబా, కౌకుంట్ల హరీష్ గౌడ్, వాగుల్ దాస్ మణికంఠ గౌడ్, ఎలికట్టకు చెందిన కార్తీక్ గా గుర్తించారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు తెలుస్తోంది. వీరికి మరో ఇద్దరు కూడా సహకరించినట్లు తెలుస్తుంది. ఆ ఇద్దరి ఆచూకీ కూడా తెలుసుకుంటామని పోలీసులు పేర్కొంటున్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో.. ప్రభుత్వం ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Ration Cards : రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ ట్విస్ట్.. ఆ తర్వాతే కార్డుల పంపిణీ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. CM Revanth Reddy : ఇది మామూలు పథకం కాదు.. దీనిని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడు..!

  4. TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!

మరిన్ని వార్తలు