viralBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణవికారాబాద్ జిల్లా

Viral Video : చల్లగా బీరు తాగుదామనుకుంటే.. ఓపెన్ చేయబోయి కంగుతిన్నారు, చంపేస్తారా బాబు.. (వీడియో)

Viral Video : చల్లగా బీరు తాగుదామనుకుంటే.. ఓపెన్ చేయబోయి కంగుతిన్నారు, చంపేస్తారా బాబు.. (వీడియో)

మన సాక్షి, వెబ్ డెస్క్:

చల్లగా బీరు తాగుదామనుకున్నాడో వ్యక్తి ఓపెన్ చేయబోయి సీసాలో ఉన్న దృశ్యం చూసి కంగుతిన్నాడు. షాపు నిర్వాహకుని అడగగా తనకి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం.. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఎక్కడో కాదు తెలంగాణలోనే.

వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు ధరూర్ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య ఇద్దరు స్నేహితులు కలిసి నాలుగు వేల రూపాయల విలువైన బీర్లతో పాటు వివిధ బ్రాండ్లను కొనుగోలు చేశారు. వాటిని ఇంటికి తీసుకెళ్ళి పార్టీ చేసుకునే లోపు బీరు ఓపెన్ చేయబోతే అందులో తేలుతున్న దృశ్యాన్ని చూసి కంగుతిన్నారు.

బడ్వైజర్ బీరులో చనిపోయి తేలుతున్న బల్లి అవశేషాలు కనిపించాయి. దాంతో వెంటనే కంగుతిన్నవారు బాటిల్ ఓపెన్ చేయకుండా షాప్ కు తీసుకెళ్లారు. అయితే షాప్ యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు దబాయించాడు. తమకేం సంబంధం లేదని, బీరు తాను తయారు చేయలేదని, కంపెనీ నుంచి వచ్చిన బీరును విక్రయించినట్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.

దాంతో లక్ష్మీకాంత్ రెడ్డి బీరు బాటిల్ లోపల అవశేషాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్ లో వైరల్ గా మారింది. మద్యం వికరించి మా ఆరోగ్యాలను చెలగాటం ఆడుతున్నారంటూ.. పలువురు మందుబాబులు కామెంట్స్ పెడుతున్నారు.

VIDEO 

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు