Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!
నల్లగొండ, మన సాక్షి.
రైతులకు అవసరమైన యూరియా ,ఎరువులు సమయానికి, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఫర్టిలైజర్స్ యూరియా ఆన్లైన్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలో “మన గ్రోమోర్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ” లో ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ ప్రారంభించారు.
ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన యూరియాను ముందుగానే బుక్ చేసుకుని, నేరుగా సమీప డీలర్ వద్ద పొందే సౌకర్యం కల్పించబడిందని కలెక్టర్ తెలిపారు.ఇకపై ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదని, ఎరువుల అక్రమ నిల్వలు, దళారుల బెడద తగ్గుతుందని చెప్పారు.
యాప్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగాయూరియా సరఫరా ,పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, ప్రతి రైతుకు న్యాయంగా ఎరువులు అందుతాయని స్పష్టం చేశారు. రైతులు తమ మొబైల్ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆధార్, భూమి వివరాలతో ఎరువులకై నమోదు చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయ అధికారులు, డీలర్లు రైతులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
డిజిటల్ వ్యవస్థల ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు జిల్లా ,మండల స్థాయి లో ఎంత యూరియా డీలర్ల దగ్గర ఉన్నదో ఈ యాప్ ద్వారా తెలుస్తుందన్నారు.ఇది శాస్త్రీయమైన యాప్ అని, ఒక రైతుకు ఉన్న 5 ఎకరాల వ్యవసాయంలో ఎంతవరకు యూరియా అవసరామో ఈ యాప్ ద్వారా ఇస్తారన్నారు.
ఈ యాప్ నిపుణులు తయారు చేశారని, చిన్న చిన్న మార్పు చేర్పులు అవసరమైనా, లేదా రైతులకు ఏమైనా సమస్యలుంటే ఏవో లేదా జెడిఎ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ ఆప్ వల్ల బోగస్ కంపెనీలు లేకుండా, బ్లాక్ మార్కెట్ జరగకుండా పారదర్శకంగా జరుగుతుందన్నారు.
ఈ ఆప్ పట్ల రైతులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని, వ్యవసాయ శాఖ మంచిఅడుగు వేసిందని, అవసరమైతే రెవిన్యూ సిబ్బంది ని ఉపయోగించుకుంటామని తెలిపారు.ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ని రైతులు ఉపయోగించుకొని రాష్ట్రలో నల్లగొండ నెంబర్ వన్ స్థానాన్ని పొందే విధంగా చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జెడి శ్రవణ్ కుమార్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరు శ్రీనివాస్,పి ఏ సి ఎస్ డైరెక్టర్ సంపత్ రెడ్డి, ఫెర్టిలైజర్ డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
MOST READ
-
TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో డబ్బులు జమ..!
-
Nalgonda : డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసానికి పన్నాగం.. రూ.18 లక్షల బదిలీకి యత్నం, పోలీసుల చాకచక్యం..!
-
Nalgonda : డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసానికి పన్నాగం.. రూ.18 లక్షల బదిలీకి యత్నం, పోలీసుల చాకచక్యం..!
-
District Incharge Collector : నారాయణపేట జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా సంచిత్ గంగ్వర్.. ఎవరో తెలుసా..!










