Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
District Incharge Collector : నారాయణపేట జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా సంచిత్ గంగ్వర్.. ఎవరో తెలుసా..!

District Incharge Collector : నారాయణపేట జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా సంచిత్ గంగ్వర్.. ఎవరో తెలుసా..!
నారాయణపేట టౌన్, మనసాక్షి:
నారాయణపేట జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా సంచిత్ గంగ్వర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృ ష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 11 వరకు లాంగ్ లీవ్ పెట్టడంతో జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతల ను స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ కు అప్పగిస్తూ సీ.ఎస్. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల జనవరి 11 వరకు జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా సంచిత్ గంగ్వర్ బాధ్య తలు నిర్వర్తించనున్నారు.








