Narayanpet : నారాయణపేట జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!
Narayanpet : నారాయణపేట జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని ఈ నెల01 నుండి నెల రోజుల పాటు ( సెప్టెంబర్ 30 వరకు) జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్.పి. యోగేష్ గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిదులు, వివిధ సంఘాల వారు ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు.
అలాగే ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రజా ధనానికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. హెచ్చరించారు.
కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని ఎస్పీ తెలిపినారు. ఎలాంటి అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
LATEST UPDATE :
Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!
Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి.. నీట మునిగిన పంట పొలాలు..!









