Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి.. నీట మునిగిన పంట పొలాలు..!

Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి.. నీట మునిగిన పంట పొలాలు..!

సూర్యాపేట, మన సాక్షి :

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి పడింది. భారీగా నీరు ప్రవహించడంతో పంట పొలాలు నీట మునిగాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో నాగార్జునసాగర్ జలాశయం పూర్తిగా నిండింది.

శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా నాగార్జునసాగర్ జలాశయం కుడి, ఎడమ కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ఎడమకాలువ కట్ట పూర్తిగా నానింది.

కాగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు రెండు చోట్ల భారీ గండి పడింది. దాంతో సాగర్ ఎడమ కాలువలో వచ్చే నీరంతా గండి ద్వారా దిగువకు ప్రవహిస్తున్నాయి. పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి.

రెండు చోట్ల కూడా 20 మీటర్ల మేర గండిపడడంతో ఎడమ కాలువ నీరంతా పంట పొలాల పైకి చేరింది. దాంతో అప్రమత్తమైన అధికారులు ఎడమ కాలువకు నీటిని నిలిపివేశారు. గండిపడిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు.

LATEST UPDATE : 

ఉధృతంగా లక్ష్మీదేవిగూడెం వాగు.. మిర్యాలగూడ – సూర్యాపేట రోడ్డు మూసివేత..! 

సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారి మూసివేత..!

Miryalaguda: మిర్యాలగూడలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం, విద్యుత్ లేక కమ్ముకున్న చీకట్లు..!

వాగులో కొట్టుకుపోయిన కారు.. కనిపించకుండా పోయిన తండ్రి, కూతురు..!

BREAKING : విజయవాడ హైవే బ్లాక్.. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు..!

 

మరిన్ని వార్తలు