TOP STORIESBreaking Newsజాతీయం

కరెంటు బిల్లుల చెల్లింపు పై కీలక ప్రకటన..!

కరెంటు బిల్లుల చెల్లింపు పై కీలక ప్రకటన..!

హైదరాబాద్, మన సాక్షి :

కరెంటు బిల్లులను జూలై 1వ తేదీ నుంచి రిజర్వు బ్యాంకు యూపీఐ ద్వారా చెల్లింపులను నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతో వినియోగదారులు నేరుగా అఫీషియల్ వెబ్ సైట్ యాప్ ల ద్వారా గత నెలలో చెల్లింపులు చేశారు.

కానీ అనేకమంది కార్యాలయాలకు వెళ్లి క్యూ లైన్లు నిలబడి చెల్లించారు. అయినా కూడా కరెంటు బిల్లుల బకాయిలు చాలా పేరుకుపోయాయి. దాంతో భారత్ బిల్ పే లిమిటెడ్ సీఈవో చతుర్వేది కీలకమైన ప్రకటన చేశారు. దాంతో వినియోగదారులకు విద్యుత్ బిల్లుల చెల్లింపులోని అడ్డంకులు తొలగిపోయాయి.

ఇక ఎప్పటి మాదిరిగానే విద్యుత్ బిల్లులను మొబైల్ ద్వారా యూపీఐ చెల్లింపులను చేయవచ్చును. తెలుగు రాష్ట్రాలలో విద్యుత్ బిల్లులను యూపీఐ ద్వారా చెల్లించేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ లోని ఏపీ సీపీడీసీఎల్ భారత్ బిల్ పేమెంట్ సిస్టంలోకి చేరాయి. ఇకపై బ్యాంకులు, ఫిన్ టెక్ యాప్ లు వెబ్ సైట్ తో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ ఫామ్ ల ద్వారా కూడా విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చును.

దానివల్ల యూపీఐ చెల్లింపులకు మార్గం సుగమం అయింది. ఇప్పటికే ఫోన్ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తుంది. మిగతా సమస్యలతో చర్చించాక గూగుల్ పే, అమెజాన్ పే ద్వారా కూడా రాబోయే రోజుల్లో కరెంట్ బిల్లులను చెల్లించవచ్చును.

ALSO READ : 

Sand Booking : నేటి నుంచి ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్.. మన ఇసుక వాహన ద్వారా 48 గంటల్లో సరఫరా..!

Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!

Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!

మరిన్ని వార్తలు