District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. నామినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. నామినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ..!
నల్గొండ, మన సాక్షి :
గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో ఎవరైనా అభ్యర్థి నామినేషన్ తో పాటు, కుల ధ్రువీకరణ పత్రం బదులుగా గెజిటెడ్ డిక్లరేషన్ సమర్పించినా అంగీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. అలాంటి వారు నామినేషన్ల పరిశీలన సమయం వరకు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించే విధంగా తెలియజేయాలని అన్నారు.
రెండవ విడత నామినేషన్ల లో భాగంగా సోమవారం ఆమె నల్గొండ జిల్లా, మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పెద్దవూర గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నామినేషన్ కేంద్రంలో సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. డిజిటల్ క్లాక్ ను నామినేషన్ వేసే అభ్యర్థులకు స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు.
సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ కేంద్రంలోకి వచ్చిన వారిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతించాలని,
5 తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితులలో నామినేషన్ వేసేందుకు అనుమతించవద్దని ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో పాటు, నామినేషన్ పత్రంలో అన్ని ఖాలీలు సంపూర్ణంగా పూరించేలా అవగాహన కల్పించాలని , హేల్ఫ్ డెస్క్ లో ఉన్న వారు, ఆర్వో వీటన్నిటిని తెలియజేసేలా ఉండాలని సూచించారు.
నామినేషన్ల వివరాలను జాప్యం లేకుండా పంపించాలని, టీ పోల్ లో అప్లోడ్ చేయడం, జిల్లా కేంద్రానికి పంపించడం లో జాప్యం చేయవద్దు అన్నారు. నామినేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, నామినేషన్ సందర్భంగా స్వీకరించే పత్రాల వివరాలు తెలిపే ఫ్లెక్సీ, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎం పి డి ఓ ఉమాదేవి, తహసీల్దార్ శ్రీదేవి, ఎం ఈ ఓ రాము, ఆర్ ఐ లు శ్రీనివాస రెడ్డి, రామకృష్ణ, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టు.. త్వరలో విమాన సర్వీసులు..!
-
Sarpanch : సర్పంచ్ గా టికెట్ కేటాయిస్తే గెలుస్తా.. గ్రామాభివృద్దికి కృషి చేస్తా..!
-
Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!
-
Murder : గిరిజన మహిళను హత్య చేసి బావిలో పడేసిన ఉదంతం.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..!










