ఆంధ్రప్రదేశ్Breaking Newsపండుగలు

కోడి పందేలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేల జోరు సాగుతుంటుంది. కోడిపందేల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది పర్యాటకులు వస్తుంటారు.

కోడి పందేలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేల జోరు సాగుతుంటుంది. కోడిపందేల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా రాష్ట్రంలో నిర్వహించే కోడిపందేలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. జంతు హింస నిరోధక చట్టం, జూదం పై రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొన్నది.

కోడిపందేలు నిర్వహించే సమాచారం అందిన వెంటనే పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించాలని సూచన చేసింది. కోడిపందేలు, జూదంలో లభించిన సొమ్మును వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. కాగా పోలీసులు నిర్వహించే గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు.

MOST READ 

  1. Miryalaguda : మిర్యాలగూడలో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం..!

  2. Yadadri : యాదాద్రి జిల్లాలో నిండు గర్భిణీ పట్ల నిర్లక్ష్యం.. ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది..!

  3. TG News : కొత్త వాహనాలు కొనేవారికి శుభవార్త.. ఇక ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు..!

  4. Narayanpet : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు.. మన సాక్షి క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ..!

మరిన్ని వార్తలు