ACB : సూర్యాపేట జిల్లాలో.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..!
ACB : సూర్యాపేట జిల్లాలో.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..!
పెన్ పహాడ్, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని నాగుల పాటి అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆనంతుల సతీష్ కుమార్ పై అవినీతి ఆరోపణలు రాగ.. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నల్గొండ రేంజర్ ఎసిబి . డి.ఈ ఎస్పీ.జగదీష్ చంద్రర్ తన సిబ్బంది తో విచారణ చేపట్టారు.
అనంతరం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఈ నెల 6 తేదీ న నాగుల పాటి అన్నారం గ్రామానికి చెందిన బొగ్గుల బట్టి వ్యాపారి గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ వద్ద కు వెళ్లి బొగ్గు బట్టి పెట్టుకోవటానికి అనుమతి పత్రం ( ఎన్. ఓ. సి) ఇవ్వడానికి 15 వేలు లంచం అడిగాడు. దీంతో అన్ని డబ్బులు ఇచుకోలేను 8 వేల రూపాయలు ఇవ్వగలనని పంచాయతీ కార్యదర్శి తో తెలిపాడు .
అట్టి 8 వేల రూపాయలు కూడా పంచాయతీ కార్యదర్శి ఇవ్వడం ఇష్టం లేక బొగ్గు బట్టి వ్యాపారి ఏసీబీ అధికారుల ను ఆశ్రహించారు. గురువారం నల్గొండ రేంజ్ ఏసీబీ డి.ఎస్పీ జగదీష్ చంద్రర్ తన సిబ్బంది తో వచ్చి గ్రామ పంచాయతీ విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
విచారణ జరిపిన ఆధారాల బట్టి అనంతుల సతీష్ కుమార్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని నాంపల్లి ఏసీబీ కోర్ట్ లో హాజరు పరచనునట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి :
-
MLC Kavitha : మహంకాళి ఆమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత..!
-
Nalgonda : తెలంగాణలో డ్రగ్స్ పై యుద్ధం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
-
Fact Check : ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..!
-
Railway Track : తెలంగాణలో రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్.. (వీడియో)
-
Electricity Bill : విద్యుత్ బిల్లులో 50 శాతం రాయితీ.. అస్సలు మిస్ కావద్దు..!









