Breaking NewsTOP STORIESక్రీడలుప్రపంచం

T20 World Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో.. విశ్వవిజేతగా భారత్..!

T20 World Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో.. విశ్వవిజేతగా భారత్..!

మన సాక్షి , స్పోర్ట్స్ :

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన టి20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. 17 సంవత్సరాల తర్వాత కప్పు గెలుచుకుంది. శనివారం దక్షిణాఫ్రికాలో తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2007 తర్వాత మరోసారి మెగాటోర్నీ భారత్ కైవసం చేసుకుంది. అలాగే 2011 తర్వాత ఏ ఫార్మాట్లోనైనా జట్టు ఇదే తొలిసారి విజయం సాధించడం మొదటిసారి. ఫైనల్ కు చేరిన దక్షిణాఫ్రికా విజయం అంచుల వరకు వచ్చినా చివర్లో మ్యాచ్ గెలవలేకపోయింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (76) అక్షర్ పటేల్ (47 )శివం దూబే (27 )రాణించారు. కేశవ్, నోకియాకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి ఓటమిపాలైంది. హార్దిక్ కు 3, ఆర్డర్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లీ. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా బూమ్రా నిలిచారు

ఉత్కంఠ భరితంగా చివరి ఓవర్ :

ఆఖరి ఓవర్లలో 16 పరుగులు గెలుపుకు అవసరమయ్యాయి. హార్దిక్ వేసిన వైడ్, ఫుల్ టాస్క్ మిల్లర్ భారీ సిక్సర్ గా మలిచే ప్రయత్నంలో సూర్య సూపర్ క్యాచ్ లో వెనుతిరిగాడు. రబడ ఫోర్ సాదించినా ఐదో బంతికి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ సంబరాలు ఆకాశాలుంటాయి.

ALSO READ :

SLBC : ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద సొరంగం శ్రీశైలం.. నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..! 

Runamafi : రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రకటన.. కీలక అప్ డేట్..!

 

మరిన్ని వార్తలు