Railway Recruitment : ఇండియన్ రైల్వేస్ లో కొలువుల జాతర.. వేతనం రూ.35000.. వెంటనే దరఖాస్తు చేయండి..!

Railway Recruitment : ఇండియన్ రైల్వేస్ లో కొలువుల జాతర.. వేతనం రూ.35000.. వెంటనే దరఖాస్తు చేయండి..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఇండియన్ రైల్వేలో కొలువుల జాతర కొనసాగుతుంది. కేవలం 10వ తరగతి /ఐటిఐ /అప్రెంటిస్ లోనే ఉద్యోగం సాధించవచ్చు. మొదటి నెల నుంచి 35 వేల రూపాయల వేతనం పొందే ఈ అవకాశాన్ని నిరుద్యోగులు అసలు వదులుకోవద్దు. వివరాలు ఏంటో తెలుసుకుందాం..
ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల ఎంపిక కోసం నోటిఫికేషన్ వెలువడింది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ పరీక్ష తెలుగు మాధ్యంలో కూడా రాసుకునే అవకాశం ఉంది. 14 విభాగాలలో పోస్టులు వెలుపడ్డాయి. 32,438 కొలువులకు నోటిఫికేషన్ వెలువడింది.
ముఖ్యమైన వివరాలు :
పదవ తరగతి ఐటిఐ లేదా సమానం ఎన్సివిటి జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. ఒకటి జనవరి 20 25 నాటికి 18 నుంచి 36వ సంవత్సరాల మధ్య వయసులో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబిసి కి మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరి ప్రకారం పది సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల గరిష్ట వయసులో సడలింపు ఉన్నది.
దరఖాస్తు : చివరి తేదీ 2025 ఫిబ్రవరి 22, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్స్ , ఈ బీసీలకు 250 రూపాయల ఫీజు ఉంటుంది. పరీక్షకు హాజరైన వారికి బ్యాంకు చార్జీలు మినహాయించి మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు. ఇతర వర్గాల వారికి 500 రూపాయల పరీక్ష ఫీజు ఉంటుంది. పరీక్షకు హాజరైతే బ్యాంకు చార్జీలు నిర్వహించి మిగిలినవి వెనక్కి ఇస్తారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
ఏ ఉద్యోగాలు, ఎంత వేతనం :
రైల్వేలో 14 విభాగాల్లో ఈ పోస్టులకు భర్తీ చేస్తారు. ఇవన్నీ ఎస్ అండ్ టి , మెకానికల్ , ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి. ఎంపికైన వారికి అసిస్టెంట్స్, ట్రాక్మెన్, పాయింట్స్ మెన్ హోదాలు వస్తాయి. వీరికి లెవెల్ వన్ మూలవేతను 18 వేల రూపాయలు ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లతో కలిపి మొదటి నెల నుంచి 35 వేల రూపాయలను అందుకుంటారు. సర్వీసు, విద్యార్హతలు, అంతర్గత పరీక్షలతో పదోన్నతులు కూడా ఉంటాయి.
ఆన్ లైన్ పరీక్ష: వీరి ఎంపిక గాను ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు తప్పు సమాధానానికి వన్ బై త్రీ మార్కు తగ్గిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిలో జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు ఉంటాయి.
అర్హత : అన్ రిజర్వుడు ఈడబ్ల్యూఎస్ వారు 40 , ఓ బి సి ఎస్సి, ఎస్టీలు 30% మార్కులు పొందాల్సి ఉంది. ఇలా అర్హులైన వారి జాబితా నుంచి మార్కుల మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేసి వారికి దేహదారుడే పరీక్షలు నిర్వహిస్తారు.
దేహదారుడ పరీక్షలు : ఖాళీలకు 3 ప్రకారం ఈ పరీక్షలకు పిలుస్తారు. వీటిలో పురుషులు రెండు నిమిషాల్లో 35 కిలోల బరువు ఇసుక బస్తా దించకుండా 100 మీటర్ల దూరానికి తీసుకెళ్లాలి. ఇందులో విజయవంతమైన వారికి కిలోమీటర్ దూరాన్ని నాలుగు నిమిషాల 15 సెకన్లలో చేరుకోవాలి.
అదేవిధంగా మహిళలైతే 20 కిలోల బరువు ఉన్న ఇసుక బస్తా దించకుండా రెండు నిమిషాల్లో 100 మీటర్ల దూరంకి తీసుకెళ్లాలి. దీంట్లో విజయవంతమైన వారికి కిలోమీటర్ దూరాన్ని ఐదు నిమిషాల 40 సెకండ్లలో చేరుకోవాలి.
దీనిలో విజయవంతమైన వారికి జాబితా నుంచి విభాగాల వారీగా పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందిన వారికి ధృవపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉద్యోగంలో తీసుకుంటారు.
వెబ్సైట్ : htyps://www.rrbapp.gov.in/auth/landing
MOST READ :
-
Holidays : ఫిబ్రవరిలో అన్ని సెలవులా.. ఎందుకో తెలుసుకుందాం..!
-
Gold Price : ఒక్క రోజే గోల్డ్ ఢమాల్.. రూ.1700 తగ్గిన ధర..!
-
Rythu Bharosa : రైతు భరోసా ప్రారంభం నేడే.. అమలు ఎప్పుడో తెలుసా.. బిగ్ అప్డేట్..!
-
Miryalaguda : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షల్లో వసూలు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్..!
-
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్నకు బెయిల్..!









