Nalgonda : అమాయక ప్రజలే వారి టార్గెట్.. అధిక వడ్డీ ఇస్తామని అంత మోసమా..!

Nalgonda : అమాయక ప్రజలే వారి టార్గెట్.. అధిక వడ్డీ ఇస్తామని అంత మోసమా..!
నల్లగొండ, మన సాక్షి
అధిక వడ్డీ పేరుతో ప్రజలకు ఆశ చూపి దాదాపు కొన్ని కోట్ల రూపాయలను ఏజెంట్లను పెట్టి ప్రజల వద్ద నుండి వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు.
సోమవారం ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధిక వడ్డీ వ్యాపారస్తుల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్ పి హెచ్చరించారు. పీఏ పెళ్లి మండలం పలుకు తండా చెందిన రామావత్ మధు, మాడుగులపల్లి మండలం చెందిన పాలిత్య భరత్ కుమార్, త్రిపురారం మండలం వస్త్రం చెందిన నగరా బాబు. బాలాపూర్ మండలం అల్మాస్గూడ కు చెందిన సభావత్ రమేష్ ,పిఎ పల్లి మండలం పలుకు తండాకు చెందిన రామావత్ రవీందర్, పీఏ పల్లి మండలం వద్దిపట్ల చెందిన సత్తు నరేష్ ,చండూరు మండలం సిద్దేపల్లి చెందిన కడారి రాంప్రసాద్ , దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన రమావత్ గణేష్ లు అధిక వడ్డీ పై ప్రజలకు ఆశ కల్పించి వారి వద్ద నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని వీరందరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్త్చంద్ర పవర్ తెలిపారు.
నేరస్తులంతా నేరం చేయు విధానంపై వివరణ ఇస్తూ
పలుగు తండా వద్దిపట్ల గ్రామానికి చెందిన రామవత్ మధు నాయక్ పదవ తరగతి మోడల్ స్కూల్ పుట్టాంగండి లో కరోనా టైంలో పాసై చదువు అబ్బక ఇంటర్మీడియట్ లో చదువు ఆపితరువాత ఫెర్టిలిజర్ షాప్ లో డిస్ట్రిబూటర్ గా వ్యవసాయానికి సంబందించిన కొత్త కొత్త మందులను నల్గొండ జిల్లా లోని వివిద మండలాలకు మార్కెటింగ్ గురించి తిరిగేవాడని తెలిపారు.
ఆ క్రమంలో చాలామంది వ్యక్తులు పరిచయం అయినారనీ. ఇతని స్వంత గ్రామములొ అన్న వరస అయినటువంటి బాలాజి నాయక్ ఆధిక వడ్డీలు ఇస్తుండేవాడు. మొదటిలో అతని దగ్గర ఏజెంట్ గా పని చేసి తరువాత నేనే కంపెనీ పెట్టి డబ్బులు ఎందుకు వసూలు చేయకూడదని, మధు అతని బావలు భరత్, బాబు, రమేశ్ లు నిశ్చయించుకుని ఎలాగో మనమందరం ఆర్దికంగా వెనకబడి ఉన్నామనీ, మనం ఆర్దికంగా స్థిరపడలంటే నీవు కూడా బాలాజి కంటే ఆదిక వడ్డీ ఇస్తానని చెప్పి మా కంపెనీలలో పెట్టుబడులు పెట్టండి మీ డబ్బులను రెట్టింపు చేస్తానని నెల నెల ఆదిక మొత్తంలో వడ్డీలు ఇస్తామని మాయమాటలు చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇక్కడినుంచి పారిపోదామని చెప్పినాడనీ దానికి పథకం ప్రకారం మధు జి ఎన్ ఐ గోకులనంద ఇన్ఫ్రాఅనే కంపెనీ జహీరాబాద్ దగ్గర వెంచర్లు వున్నాయని అదే విదంగా హైదరాబాద్ లో పబ్బులు, స్పా సెంటర్లు, కర్నూల్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని డాకుమెంట్స్ ప్రజలకు చూపించి, బాలాజి కంటే అధికంగా నెలకు 15-18 రూపాయలు వడ్డీ ఇస్తామని ఆకర్షితమైన మాటలు చెప్పి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టినాడనీ తెలిపారు.
దానికిగాను కొందమంది ఏజెంట్లను నియమించుకుని, ఇలా వచ్చిన డబ్బులతో అతని బావల ఆదేశాల మేరకు ఆస్తులను కొనడం ప్రారంబించారు.అట్టి డబ్బులతో 2025 జనవరి నెలలో హైదరాబాదులో గోకులనందన ఇన్ఫ్రా ఐడియా ప్రైవేట్ కంపెనీ అని ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసును ఏర్పరచుకొని నా యొక్క జీవన విధానంలో ప్రజలకు నమ్మకం కలిగే విధంగా జీవన శైలిని మార్చుకొని లగ్జరీ లైఫ్ లో భాగంగా ఫార్చునర్ కారు కొని, అదేవిధంగా ఊర్లో జనాలకి నమ్మకం కలిగించడానికి పెద్ద ఇల్లు నిర్మించడము ప్రారంబించాడనీ అప్పుడు ఊరి ప్రజలు ఇతని పేరును జనాల లోనికి నమ్మేవిదంగా తీసుకువెళ్లినారు.
వీరిని చూసి మరి కొంత మంది ఏజెంట్లను పలుగు తండా చుట్టూ ప్రక్కల గిరిజన తాండలు,గ్రామాల నుండి ఏర్పాటు చేసుకొని అదిక వడ్డీ ఇస్తానని ఆశ పెట్టి వీరి వద్ద డబ్బులు తీసుకొని వారికి ప్రామిసరీ నోట్లు వ్రాసి ఇచ్చి నెలకు 10 రూపాయల వడ్డీ చెల్లించేవాడనీ ఇట్టి డబ్బులతో ఇతను మరియు ఇతని బందువుల మరియు స్నేహితుల పేర్లతో వ్యవసాయ భూములు, ఇండ్లు కరిదైన కార్లు,బైక్ లు కొని జల్సాలు చేసేవాడు.
ఇంకా అదిక డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతో నెలకు 10 రూపాయల వడ్డీ ఇస్తానని జనాలను నమ్మించి కోట్లలో డబ్బులు వసూలు చేసి వడ్డీ మాత్రమే ఇచ్చి బాదితుల వద్ద ఉన్న ప్రామిసరీ నోటు వెనుకల వడ్డీ ఇచ్చినట్లు వ్రాసి పాత ప్రామిసరీ నోటు తీసుకొని కొత్త ప్రామిసరీ నోటు అదే అసలు అమౌంట్ కి వ్రాసి ఇచ్చేవాడనీ ఎస్పీ తెలిపారు.
ఇలా వచ్చిన కోట్ల డబ్బులతో పబ్ అండ్ బార్ మరియు స్పా సెంటర్ కోసం సుమారు 2.5 కోట్లు,ఆన్ లైన్ ద్వార బయటి రాష్ట్రాలలో ఐపీఎల్బెట్టింగ్ ద్వార 40 లక్షలు, స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసి 60 లక్షలు పెట్టిబడిపెట్టి నష్ట పోయినాడనీ గత కొన్ని నెలలుగా బాదితులకు అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వలేక పోయే సరికి బాదితులు మధు పై వత్తిడి చేయడం ప్రారంబించారనీ ఇన్ని డబ్బులు ఇవ్వలేక మధు బాదితుల నుండి తప్పిచ్చుకొని పారిపోయాడనీ తెలిపారు
అక్టోబర్ మొదటి వారంలో బాదితుల పిర్యాదు మేరకు తెలంగాణ డిపాసిటర్ ఆక్ట్ చీటింగ్ కేసులు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి,రిమాండుకి తరలించడం జరిగిందన్నారు.ఇట్టి కేసులు అడిషనల్ యస్.పి ఆద్వర్యంలో విచారణ జరుగుతుందనీనేరస్తులని పోలీస్ కస్టడీకి తీసుకొని తదుపరి విచారణ చేయడం జరుగుతుందనీ తెలిపారు.?బాధితులు ఎవరు ఒత్తిడికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని బాధితులు నేరుగా వారి వద్ద ఉన్న పత్రాలను తీసుకొని పోలీసు వారిని సంప్రదిస్తే విచారణ చేసి నేరస్థుల ఆస్తులను దత్త చేయడం జరుగుతుందని తెలిపారు.
MOST READ :
-
District collector : వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. అలా చేస్తే చర్యలు..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోళ్లు అలా చేయాలి..!
-
Gold Price : భారీగా రూ.19,100 తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Volleyball : వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఎంపిక..!










