BREAKING : ఇంటింటా ఇన్నోవేటర్, ఆ తేదీలోగా వివరాలు పంపాలి.. జిల్లా కలెక్టర్..!
BREAKING : ఇంటింటా ఇన్నోవేటర్, ఆ తేదీలోగా వివరాలు పంపాలి.. జిల్లా కలెక్టర్..!
పెద్దపల్లి ధర్మారం , మన సాక్షి ( ప్రతినిధి):
ఆగస్టు 3 లోగా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనేవారు తమ వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఇంటింటా ఇన్నోవేటర్ 2024 సంవత్సరానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం ప్రస్తుతం 2024 ఎడిషన్ ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రాం కోసం దరఖాస్తులను స్వీకరిస్తుందని, అన్ని వర్గాలలో ఉన్న ఆవిష్కర్తలు, జిల్లాలోని గ్రామీణ, పట్టణ ఔత్సాహికులు ఆవిష్కరణ లలో తమ ప్రతిభను చాటుకునేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం చక్కని వేదికగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు.
గ్రామీణ ఆవిష్కర్తల సాధికారతపై దృష్టి సారించి 33 జిల్లాలు అన్నిటిని కవర్ చేయాలని, మూడు వేలకు పైగా ఎక్కువ గ్రామ పంచాయతీలతో నిమగ్నం కావాలని, కోటికి పైగా గ్రామీణ ప్రజలతో అనుసంధా నించాలని ఇంటింటా ఇన్నోవేటర్ 2024 లక్ష్యంగా పెట్టుకుందని కలెక్టర్ తెలిపారు.
ప్రస్తుత సంవత్సరం కొత్తగా జిల్లాకు ఒకరు చొప్పున 33 మంది యువ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి నియమిస్తుందని, ఇన్నోవేషన్ మిత్రులుగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు సమన్వయకర్తలుగా పని చేసి జిల్లా అధికారులు, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణ ప్రజలతో, విభిన్న వాటాదారులతో నిమగ్నం అవడంలో కీలకపాత్ర పోషిస్తారని అన్నారు.
ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణలను ప్రోత్సహించడం జరుగుతుందని, గ్రామీణ, విద్యార్థుల, వ్యవసాయ రంగ ఆవిష్కరణలు , సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు మొదలగునవి అంగీకరించబడతాయని కలెక్టర్ తెలిపారు.
ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆవిష్కరణ యొక్క నాలుగు చిత్రాలు(హై రిజల్యూషన్), ఆవిష్కరణ విధులను ప్రదర్శించే రెండు వీడియోలు, 100 పదాలలో ఆవిష్కరణ వివరణ, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు తదితర వివరాలను వెంటనే 9100678543 కి వాట్సాప్ చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఇన్నోవేటర్స్ నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 3 ఆగస్ట్ అని, అందుకున్న దరఖాస్తుల నుండి మొదటి షార్ట్‌లిస్ట్ తరువాత ప్రతి జిల్లా నుంచి ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపిక చేయబడుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి డి. మాధవి, ఈడిఎం కవిత, కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, ఇన్నోవేషన్ మిత్ర మునింధర్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
Good News : తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఈ పథకానికి లక్షల్లో ఆర్థిక సహాయం..!
BREAKING : పదవ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి..!
Hair Growth : జుట్టు పెరుగుదల, బట్టతల రాకుండా ఏం చేయాలి.. నేచురల్ గా పెరుగుతుంది..!









