తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Additional Collector : ఇంటర్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. అదనపు కలెక్టర్..!

Additional Collector : ఇంటర్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. అదనపు కలెక్టర్..!

నల్లగొండ, మన సాక్షి :

మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ అధికారులతో కోరారు. సోమవారం అయన తన చాంబర్లో ఇంటర్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ విషయమై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మార్చి 5 నుండి మార్చి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ,మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు.ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా, పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి.

నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను 28722 మంది విద్యార్థులు రాయనుండగా, పదవ తరగతి పరీక్షలను 18666 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. ఇంటర్ పరీక్షల కోసం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, పదవ తరగతి పరీక్షలకు 105 రెగ్యులర్ కేంద్రాలు, 3 ప్రైవేటు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు అదనపు కలెక్టర్ కు వివరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు పలు సూచనలను, ఆదేశాలను జారీ చేస్తూ…పరీక్షల సందర్భంగా 144 వ సెక్షన్ విధించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని,

పరీక్షలు నిర్వహించే మార్చి 5 నుండి ఏప్రిల్ 4 వరకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలని,సీసీ కెమెరాల మధ్య పరీక్షలు నిర్వహించనున్నందున విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం ఉండకుండా చూడాలని ఎలక్ట్రిసిటీ అధికారులను కోరారు. అదేవిధంగా పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించగా, ఫస్ట్ ఎయిడ్, ఏఎన్ఎం లను, మందులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు .

ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతం నుండి అలాగే పట్టణ ప్రాంతాలలో సరైన బస్సులు నడపాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఆర్టిఓ అధికారులు పరీక్ష ప్రశ్నాపత్రాలను తీసుకువెళ్లేందుకు సరైన వాహనాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పోస్టల్ అధికారులు ప్రశ్నపత్రాలు భద్రంగా డిపాజిట్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ తెలిపారు.డిప్యూటీ తాసిల్దార్లను పదవ తరగతి పరీక్షలకు సిట్టింగ్ స్క్వాడ్లుగా నియమించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

నెలరోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్ , పదవ తరగతి రెండు పరీక్షలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పరీక్షలను సవ్యంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా జిల్లాలో ఇంటర్, పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఎలాంటి పేపర్ లీకేజీ, మాస్ కాపీ , మాల్ ప్రాక్టీస్ వంటివి జరగకుండా చూడాలని, ప్రైవేట్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన ఆదేశించారు.

పరీక్షా కేంద్రం లోకి ఎవరికి సెల్ఫోన్ అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్ , జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, విద్యు త్ ,మెడికల్, ఆర్టీసీ, ట్రాన్స్పోర్ట్, సమాచార, పోస్టల్, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్, తదితర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

MOST READ :

  1. Liquor : మూడు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్..!

  2. Elections : మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!

  3. Huzurnagar : తాళం వేసి ఉంటే చాలు.. వాళ్లు మామూలోళ్లు కాదు..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!

  5. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!

మరిన్ని వార్తలు